• Jun 13, 2026
  • NPN Log

    ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో దక్షిణ కొరియా బోణీ కొట్టింది. చెకియాపై 2-1 తేడాతోఈ ఆసియా జట్టు విజయం సాధించింది. గ్రూప్-ఏ లో తలపడిన ఈ రెండు జట్లూ గెలుపు కోసం చివరివరకూ పోరాడాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ భాగంలో ఏ జట్టు కూడా గోల్ సాధించలేదు. కానీ, రెండో అర్ధ భాగం నుంచి ఆట పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండో సగం మొదలైన కాసేపటికే చెకియా ప్లేయర్ లాడిస్లావ్‌ గోల్ కొట్టి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. మ్యాచ్‌ ప్రారంభమైన 59వ నిమిషంలో తొలి గోల్ నమోదైంది. దక్షిణ కొరియా ప్లేయర్ హవాంగ్‌ బోయిమ్ 67వ నిమిషంలో గోల్‌ కొట్టి స్కోరును సమం చేశాడు. ఇక మరో గోల్ కోసం ఇరుజట్లూ చాలా సమయం పాటు శ్రమించాయి. చివరకు 80వ నిమిషంలో దక్షిణ కొరియా ఆటగాడు ఓ హైన్ గ్యు గోల్‌ కొట్టి.. తమ జట్టును 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

    ఆట అదనపు సమయంలోనూ కొరియా ఆటగాళ్లు పట్టువిడవలేదు. చెకియా ప్లేయర్లను గోల్‌ చేయనివ్వకుండా కట్టడి చేయడంలో సౌత్ కొరియా ఆటగాళ్లు విజయం సాధించారు. ఆటలో ఎక్కువ భాగం బంతిపై నియంత్రణ దక్షిణ కొరియాకే ఉంది. చెకియా 16 పొరపాట్లు చేయగా.. దక్షిణ కొరియా 9 చేసింది. గ్రూప్-ఏలో తొలి విజయాలు నమోదు చేసిన మెక్సికో, దక్షిణ కొరియా జూన్ 18న గ్వాడలజారా వేదికగా తలపడనున్నాయి. అలానే అట్లాంటా వేదికగా దక్షిణాఫ్రికాతో చెక్ రిపబ్లిక్ జట్టు ఆడనుంది.
     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement