వాటర్ బాటిల్ మూతలు వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో తెలుసా?
దాహం వేసినప్పుడు మనం సాధారణంగా వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటాం. అయితే ఆ బాటిళ్లకు ఉండే మూతలు నీలం, తెలుపు, ఆకుపచ్చ వంటి వేర్వేరు రంగుల్లో ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రంగుల వెనుక కొన్ని ప్రత్యేక సూచనలు ఉంటాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో తెలుస్తోంది.
మన రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువుల గురించి పెద్దగా ఆలోచించం. వాటర్ బాటిల్ కూడా అలాంటి వాటిలో ఒకటి. ఎక్కువగా మార్కెట్లో కనిపించే బాటిళ్లకు నీలం రంగు మూత ఉంటుంది. అయితే కొన్ని బాటిళ్లకు తెలుపు, ఆకుపచ్చ లేదా ఇతర రంగుల మూతలు కూడా కనిపిస్తాయి. మూత రంగును బట్టి అందులోని నీటి రకాన్ని గుర్తించవచ్చని ఆ వీడియోలో పేర్కొన్నారు.
నీలం రంగు మూత – రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్
తెలుపు రంగు మూత – ప్యూరిఫైడ్ వాటర్
ఆకుపచ్చ రంగు మూత – మినరల్ వాటర్
నలుపు రంగు మూత – ఆల్కలైన్ వాటర్
పసుపు రంగు మూత – విటమిన్లు అధికంగా ఉన్న నీరు
ఎరుపు రంగు మూత – ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉన్న నీరు
ఈ సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అన్ని కంపెనీలు ఒకే రంగు ప్రమాణాలను అనుసరిస్తాయనే అధికారిక నిబంధన లేదు. కాబట్టి బాటిల్ కొనుగోలు చేసే ముందు లేబుల్‌పై ఉన్న వివరాలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.










Comments