• Jun 13, 2026
  • NPN Log

    తిరువనంతపురం : శబరిమల దేవస్థానం వార్షిక తీర్థయాత్ర సీజన్‌లో పెరిగే భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు జయకుమార్‌ వెల్లడించారు. పంబ నుంచి సన్నిధానం వరకు భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, ఆలయంలో ఇకపై నగదు ఆధారిత చెల్లింపులు ఉండబోవని.. కానుకలు, ప్రసాదాల కొనుగోలు, వసతి వంటి అన్ని సేవలను డిజిటలైజ్‌ చేస్తున్నట్లు చెప్పారు. అవినీతి ఆరోపణలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement