• Sep 20, 2026
  • NPN Log

    అందాల భామ శోభిత ధూళిపాళ్ల  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం నాగ చైతన్య ని వివాహమాడిన ఈ చిన్నది అక్కినేని పెద్ద కోడలిగా ఒకపక్క భాద్యతలను నిర్వరిస్తూనే.. ఇంకోపక్క మంచి మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తుంది. పెళ్లి తరువాత శోభిత చీకటిలో అనే ఒక వెబ్ సిరీస్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం శోభిత తమిళ్ లో వెట్టువం అనే సినిమాలో నటిస్తోంది. పా రంజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఆర్య, విఆర్ దినేష్ హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా వరల్డ్ ఆఫ్ వెట్టువం వీడియోని రిలీజ్ చేశారు.

    ఇక వెట్టువం సినిమా ఈవెంట్ లో శోభిత అచ్చమైన తెలుగు ఆడపడుచులా మెరిసింది. శోభిత ఆఫ్ స్క్రీన్ ఫ్యాషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎన్నోసార్లు ఆమె తన ఫ్యాషన్ తో అభిమానులను మెప్పించింది. పెళ్లి తరువాత ఎక్కడ కనిపించినా అక్కినేని కోడలు చీరకట్టులోనే ఎక్కువగా దర్శనమిస్తుంది. తాజాగా ఈ ఈవెంట్ లో కూడా అమ్మడు చీరకట్టులో అదిరిపోయింది. ఇక ఆ ఫోటోలను శోభిత సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

     

    ఎరుపు, మెరూన్ రంగు కాంబినేషన్ స్ట్రైప్స్ డిజైన్‌తో ఉన్న కాటన్ హెండ్‌లూమ్ చీర.. దానికి మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో శోభిత ఎంతో రాయల్‌గా, ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది. నుదుటున పెద్ద ఎర్రటి బొట్టు, చెవులకు జుంకాలు, నడుముకు సన్నని వడ్డాణం, చేతికి మెరిసే గాజులతో సాంప్రదాయకమైన సౌందర్యాన్ని ఉట్టిపడేలా చేసింది. ఇక కర్లీ హెయిర్‌ని మెస్సీ బన్‌గా ముడివేసిన ఆమె హెయిర్ స్టైల్, మైల్డ్ మేకప్‌తో కూడిన నవ్వు చీరకు మరింత అందాన్ని పెంచేశాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కినేని కోడలి అందం వర్ణించడం చాలా కష్టం అబ్బా.. అచ్చ తెలుగింటి కోడలు అంటే ఆ మాత్రం ఉంటుందిగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement