• Sep 22, 2026
  • NPN Log

    కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 7న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, మేకర్స్ దానిని వాయిదా వేశారు. అనకాపల్లి పట్టణంలోని రియల్ లొకేషన్స్ లో షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమాను అక్కడి ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రివ్యూ వేశారు. ప్రేక్షకుల స్పందనను తెలుసుకుని, మరింత ప్రచారంతో ఘనంగా విడుదల చేయాలని అనుకున్నారు. అందుకే మరికొంత సమయం తీసుకుని ఇప్పుడు తాజాగా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు.

    'అనకాపల్లి' మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆయన మూవీ గురించి చెబుతూ, ' ‘అనకాపల్లి’ చిత్రంలో ఓ అందమైన కథ ఉంది. ఇందులో యాక్షన్‌తో పాటుగా కుటుంబ విలువలు చెప్పే గొప్ప సందేశం ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. నటీనటులంతా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. మరీ ముఖ్యంగా విక్రమ్ సహిదేవ్‌, సంధ్యా వశిష్ఠ, తారక్‌ పొన్నప్పకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది' అని చెప్పారు. ఇందులో హీరో తల్లి దండ్రులుగా ఇంద్రజ, త్రినాథరావు నక్కిన సహజ నటన కనబరిచారని మరో నిర్మాత కాండ్రేగుల నాయుడు కితాబిచ్చారు. మరి పక్కా ప్లానింగ్‌తో అక్టోబర్ 2న రాబోతున్న 'అనకాపల్లి'కి ఎలాంటి విజయాన్ని తెలుగు ప్రేక్షకులు కట్టబెడతారో చూడాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement