• Sep 22, 2026
  • NPN Log

    కరీంనగర్: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి విశేష పూజలు చేస్తున్న భక్తులు ఘనంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా నిర్వహించడానికి అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో చిన్న తప్పిదా లతో పెద్ద ప్ర మాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గణనాథుడి శోభాయాత్రను సంప్రదాయ బద్ధంగా భజనలు, కోలాటాలతో నిర్వహించుకుంటే చూసే వారికి ఆనందంగా ఉంటుంది. ట్రాఫిక్‌ ఆంక్షలు, భద్రతా ఏర్పాట్లలో స్థానిక యంత్రాంగానికి, పోలీసులకు నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలి.

    ప్రశాంతంగా నిర్వహించుకోవాలి..

    గణనాథుడికి నవరాత్రుల్లో ఉదయం, సాయంత్రం ధూప దీపనైవేద్యాలు, భజనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్ర మాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గణేష్‌ నిమజ్జన శోభాయాత్రను కూడా అంతే సంప్రదాయ పద్ధతిలో ప్రశాం తంగా నిర్వహించుకోవాలి.

    విద్యుత్‌తో జర జాగ్రత్త..

    గతంలో పలు గ్రామాల్లో నిమజ్జన సమయంలో విద్యుదాఘాతంతో గాయపడి మృత్యువాత సంఘటనలు ఉన్నాయి. మరి కొందరు అంగవైక ల్యంతో బాధపడుతున్న సంఘటనలూ ఉన్నాయి. ఎత్తయిన విగ్రహాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్‌ తీగలకు తగిలే ప్రమాదం ఉంది.

    డీజేలు వద్దు..

    నవరాత్రుల పూజల అనంతరం గణనాథుడి శో భాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్ర డీజే హోరు, నృత్యాలతో సాగుతుంది. శోభాయాత్రలో మద్యం సేవిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిమజ్జన సమయంలో ప్రమా దకర రసాయనాలతో చేసిన రంగులు చల్లుకోవడంతో కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉంది. రంగులు పడక చాలా మంది శరీరం దురదకు గురవుతుంది. సంప్రదాయ రంగులను వాడుకోవడం మంచింది.

    జలాశయాల వద్ద పొంచి ఉన్న ముప్పు

    వినాయక విగ్రహాలను చెరువులు, కుంటలు, వాగులు తదితర జలాశయాలలో నిమజ్జనం చేస్తుంటా రు. ఈసారి వర్షాలు తక్కువగా కురవడంతో చాలా చెరువుల్లో నీరు తగ్గింది. లోతైన ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం చెరువులు, కుంటల వద్ద విద్యు త్‌ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. నిమజ్జనం సందర్భంగా చిన్న పిల్లలను చెరువులు, కుంటల వద్దకు రాకుండా పెద్దలు జాగ్రత్త వహించాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement