• Sep 20, 2026
  • NPN Log

    లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలు, హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో పాటు సింగర్ గా కూడా అమ్మడు బాగా బిజీగా మారింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ఆ ఇంటర్వ్యూలో మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తేనే ఆ బాధ ఏంటో వారికి అర్ధమవుతుంది అని చెప్పి షాక్ ఇచ్చింది. అంటే తనకు PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్య ఉందని, దానివలన ఎంతో నరకంగా ఉంటుందని చెప్పే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

    'నాకు ఉన్న PCOS సమస్య వల్ల నెలసరి సమయంలో తీవ్రమైన నరకాన్ని అనుభవిస్తున్నాను. మగవారికి కూడా పీరియడ్స్ రావాలని నేను దేవుడిని వెయ్యిసార్లు వేడుకున్నాను. ఒకవేళ మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే, ఆఫీసుల్లో కంపెనీలు కచ్చితంగా పీరియడ్స్ హాలిడేస్‌ను కాంట్రాక్ట్‌లోనే రాసిచ్చేవి. ఆడవారికి ఆ వెసులుబాటు లేదు. నాకు అమ్మ అవ్వాలని ఉంది. కానీ, ఈ రోగం వలన నేను బయోలాజికల్‌గా పిల్లలు పుట్టకపోతే పిల్లలను దత్తత తీసుకుంటాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి వ్యాఖ్యలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

    గతంలో రష్మిక మందన్నా కూడా మగవారికి పీరియడ్స్ రావాలని కోరుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అప్పట్లో ఆమె చేసిన ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. మగవారి శారీరక నిర్మాణం వేరు, ఆడవారి శారీరక నిర్మాణం వేరు.. ఇలాంటి వ్యాఖ్యలు ఏంటి? అంటూ నెటిజన్లు రష్మికను దారుణంగా ట్రోల్ చేశారు. అప్పుడు రష్మిక ఇదే మాట అన్నప్పుడు ట్రోల్స్ వర్షం కురిపించిన నెటిజన్లు, ఇప్పుడు శృతి హాసన్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement