ఇంటి పన్నుపై వడ్డీ రాయితీ మరో నెల పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను మార్చి 31లోపు చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని మున్సిపల్ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ రాయితీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలిచ్చింది. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరం ఇంటిపన్ను, ఖాళీ స్థలాల పన్ను మొత్తాన్ని ఏప్రిల్ 30 లోపు చెల్లిస్తే, వారికి ఐదు శాతం రాయితీని కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీడీఎంఏ సంపత్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.










Comments