• Sep 20, 2026
  • NPN Log

    మనసుకు నచ్చిన దారిలో వెళ్లేందుకు చాలా మంది సంశయిస్తారు. ఎవరో ఎదో అనుకుంటారనో మరో సందేహంతోనే అందరూ నడిచిన దారిలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి మాత్రం మనసు చెప్పిన దారిలో వెళుతూ అసలైన ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. నెట్టింట సంచలనంగా మారింది. నేహా ఠాకూర్ అనే యువతి స్వస్థలం మండీ జిల్లా. ఆమె తండ్రి ట్రక్ డ్రైవర్. చిన్నతనంలో ఆమెకు తండ్రి నడిపే భారీ ట్రక్‌ను చూస్తే అదో అద్భుతంగా అనిపించేది. ఆమెను రోజూ తండ్రే స్వయంగా తన ట్రక్‌లో స్కూల్ వద్ద దింపేవారు. దీంతో, ట్రక్ అంటే ఆమెకు ఏదో తెలియని మక్కువ ఏర్పడింది. పెద్దయ్యాక మాత్రం ఆమె అందరూ నడిచిన దారిలోనే తన ప్రయాణం ప్రారంభించింది. మొదట్లో ఆమె తండ్రి కూడా సంచయించారు. చివరకు ఆమె సంతోషాన్ని చూశాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    ఇలా చిన్ననాటి కలను సాకారం చేసుకున్న నేహ తన అనుభవాలను షార్ట్ వీడియోల్లో కూడా పంచుకుంటూ నెట్టింట ఓ సంచలనంగా మారింది. ట్రక్ డ్రైవింగ్ సందర్భంగా కనిపించే ప్రకృతి అందాలు, పర్వతాలను వర్ణిస్తూ నెటిజన్లకు ఓ కొత్త లోకాన్ని పరిచేసింది. ట్రక్ డ్రైవర్ రోజువారి విధులు ఎలా ఉంటాయో చెబుతూ ఆమె పెట్టే వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. ఎక్కువ సేపు డ్రైవ్ చేస్తే వచ్చే సమస్యలన్నీ ఏకరవు పెడుతుంటుంది. ఇటీవల ఓ వీడియోకు ఏకంగా కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. మనసుకు నచ్చిన పనిలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆమెను నెటిజన్లు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement