కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు: కేటీఆర్
తెలంగాణ : అధికారం కోల్పోయిన రెండేళ్లకే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలన్న భావన ప్రజల్లో కలిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో చాలా చోట్ల పోటాపోటీగా స్థానాలు దక్కించుకున్నట్లు తెలిపారు. ఎంపీగా గెలవడం కంటే సర్పంచ్‌గా గెలవడం కష్టమనేది నిజమని భువనగిరి పర్యటనలో ఆయన చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సీఎం రేవంత్ చెప్పినట్లుగా స్పీకర్ చేస్తున్నారని విమర్శించారు.








Comments