గుడ్న్యూస్ చెప్పిన LIC
ప్రభుత్వ బీమా సంస్థ LIC తమ ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్ చెప్పింది. 1:1 నిష్పత్తిలో బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపింది. రికార్డు తేదీ నాటికి వాటాదారులు కలిగి ఉన్న ప్రతి షేరుకు అదనంగా ఉచిత షేరును ఇవ్వనుంది. అంటే మీ వద్ద 100 షేర్లు ఉంటే బోనస్ తర్వాత అవి 200 షేర్లు అవుతాయి. రికార్డ్ డేట్ను త్వరలో ప్రకటించనుంది. 2022 మే నెలలో స్టాక్ మార్కెట్లో LIC లిస్ట్ అయింది.










Comments