జాతీయ స్కేటింగ్‌లో తెలంగాణ హవా
హైదరాబాద్ : జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ క్రీడాకారులు 20 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్య పతకాలు కొల్లగొట్టారు. విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో సీనియర్ మిక్స్‌డ్ రోలర్ హాకీ టీమ్ విభాగంలో మాలిక్, రియా, సందీప్, మౌనిక, శ్వేత, ఆదిత్య ప్రేరణ, కుమార్, కోమల్, కేశవ్‌తో కూడిన తెలంగాణ బృందం స్వర్ణం సొంతం చేసుకుంది. ఫిగర్, ఫ్రీ, పెయిర్ విభాగాల్లో హైదరాబాద్ స్కేటర్ ఓర్జిత్ 3 స్వర్ణాలు అందుకున్నాడు. ఫ్రీ, పెయిర్ విభాగాల్లో రుత్విక, సోలో, ఫిగర్ విభాగాల్లో సాకేత్, సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్ విభాగాల్లో జోస్ బెన్ని, పెయిర్, సొలో, కపుల్ విభాగాల్లో అద్వైక, సోలో, కపుల్ డ్యాన్స్ విభాగంలో వెంకట్ రామ్‌రెడ్డి-అన్విత కృష్ణ, సీనియర్ కపుల్ డ్యాన్స్‌లో తేజే్‌ష-జియా పటేల్ జోడీ, కపుల్ డ్యాన్స్ విభాగంలో తనిష్కా సింగ్-రక్షిత్ మురళి స్వర్ణాలు గెలుపొందారు.









Comments