• May 02, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని ఏనాడూ తక్కువ చేసి చూడలేదని, ఆయన గౌరవన్ని తగ్గించేలా ఎప్పుడూ వ్యవహరించలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చినా వినకుండా మొండి పట్టుదలతో కాంగ్రెస్‌ పార్టీని వీడారన్నారు. తనపై వ్యక్తిగత ద్వేషం, ఈర్ష్యతోనే జీవన్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని ఆరోపించారు. గతంలో టీపీసీసీ అధ్యక్ష పదవిని జీవన్‌రెడ్డి కోరుకున్నారని, కానీ పార్టీ నాయకులు, కార్యకర్తల మద్దతుతో ఆ పదవి తనను వరించిందని అన్నారు. బీఆర్‌ఎ్‌సపై అలుపెరగని పోరాటం చేసి.. కాంగ్రె్‌సను అఽధికారంలోకి తెచ్చానని, దీన్ని జీవన్‌రెడ్డి సహించకపోతే తానేం చేయాలని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం రేవంత్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు ఎంతగానో కష్టపడ్డారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన్ను కరీంనగర్‌ నుంచి పోటీ చేయాలని కోరామని, కానీ ఆయన నిజామాబాద్‌ నుంచే పోటీ చేస్తానన్నా.. టికెట్‌ ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆయన ఓటమిపాలయ్యారన్నారు. ఎంపీగా పోటీ చేసిన జీవన్‌రెడ్డికి తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం జగిత్యాలలో కూడా జనం ఓట్లు వేయలేదని, ఎందుకిలా జరిగిందో జీవన్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. దుర్మార్గుడైన కేసీఆర్‌తో జతకట్టి.. కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంత్రి పదవి రాలేదనే కారణంతోనే జీవన్‌రెడ్డి పార్టీ మారుతున్నారని విమర్శించారు. పదవి రాకపోవడానికి పార్టీ కారణం కాదని, పార్టీపై నెపం నెట్టాలని చూడడం సరికాదని అన్నారు. గతంలో 39మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకొని మంత్రివర్గంలో తీసుకున్న కేసీఆర్‌కు జీవన్‌రెడ్డి ఎలా జై కొడతారని ప్రశ్నించారు. పలువురు మాట్లాడుతూ పెద్ద నాయకులు పార్టీని వీడినా తాము కొనసాగుతామని స్పష్టం చేశారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement