• Sep 20, 2026
  • NPN Log

    టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ (63) పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. ఇవాళ (గురువారం) ముంబైలోని బాంబే హౌస్‌లో జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    మునుపటి నిర్ణయం ఉపసంహరణ: ఈ ఏడాది ఆగస్టు 12న చంద్రశేఖరన్ తన ప్రస్తుత పదవీకాలం పూర్తి కాగానే మూడోసారి ఛైర్మన్‌గా కొనసాగే ఉద్దేశం లేదని ప్రకటించారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు, మారిన పరిస్థితుల దృష్ట్యా నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ (NRC) ఆయనను మళ్లీ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరింది.

    నోయెల్ టాటా వ్యతిరేకత: టాటా ట్రస్ట్స్ ఛైర్మన్, టాటా సన్స్ బోర్డు డైరెక్టర్ నోయెల్ టాటా మాత్రమే ఈ పునర్నియామక తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

    ఐపీఓ (IPO) వివాదం: టాటా సన్స్ కంపెనీని స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ (IPO) చేయడాన్ని నోయెల్ టాటా మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, టాటా సన్స్‌లో దాదాపు 18శాతం వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజీ (SP) గ్రూప్ కంపెనీ లిస్టింగ్‌కు అనుకూలంగా ఉంది.

    2017 నుంచి టాటా సన్స్ ఛైర్మన్‌గా సేవాలందిస్తున్న చంద్రశేఖరన్ నాయకత్వంలో గ్రూప్ మరింత విస్తరించడంతో, బోర్డు మెజారిటీ సభ్యులు ఆయన వైపే మొగ్గు చూపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement