• Sep 20, 2026
  • NPN Log

    ఒకవైపు ‘కెజియఫ్’, ‘సలార్’ వంటి హిట్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మరోవైపు ‘దేవర’ బ్లాక్‌బస్టర్ విజయంతో ఊపుమీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించే థియేట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    అక్టోబర్‌లో టైగర్ ఎంట్రీ

    అయితే, ఇటీవల ‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ చేతికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. దీంతో వైద్యుల సూచన మేరకు చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అందుతోంది. తారక్ ఇప్పుడు వేగంగా కోలుకుంటున్నారని.. అక్టోబర్ మొదటి వారంలో ఆయన తిరిగి షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈలోగా సమయాన్ని వృథా చేయకుండా, ప్రశాంత్ నీల్ తారక్ లేని ఇతర ముఖ్య సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు. హీరోకు గాయం కావడం వల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైనప్పటికీ, విడుదల విషయంలో మాత్రం మేకర్స్ వెనకడుగు వేయడం లేదు. ముందుగా ప్రకటించినట్లే వచ్చే ఏడాది జూన్ నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ సాధారణంగా తన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు, అందుకే షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పక్కా షెడ్యూళ్లతో ముందుకెళ్తున్నారు.

     

    స్పెషల్ మాస్ సాంగ్

    ఇక ఈ సినిమా లుక్ అండ్ ఫీల్ గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ గత చిత్రాల్లా కాకుండా, ‘డ్రాగన్’లో ఫ్లాష్‌బ్యాక్ చాలా కలర్‌ఫుల్‌గా ఉండబోతోందట. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, మలయాళ దిగ్గజ నటుడు బిజు మీనన్, సీనియర్ నటి ఖుష్బు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా, సినిమాలో ఒక క్రేజీ ‘స్పెషల్ మాస్ సాంగ్’ ఉండబోతోందట. అందులో రుక్మిణి వసంత్‌తో పాటు మరో ఇద్దరు భామలతో తారక్ ఊరమాస్ స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. దీనికి తోడు బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి తొలిసారి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement