దియా జోడీకి డబుల్స్ టైటిల్
హైదరాబాద్ : జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో మాజీ షట్లర్, కోచ్ చేతన్ ఆనంద్ కుమార్తె దియా ఆనంద్ డబుల్స్ విజేతగా నిలిచింది. బిహార్‌లోని భాగల్పూర్లో జరిగిన ఈ పోటీల్లో అండర్-13 బాలికల డబుల్స్ ఫైనల్లో దియా ఆనంద్-ఆభా జాదవ్ (తెలంగాణ) జోడీ 21-14, 16-21, 21-15తో ఆన్య (తెలంగాణ)-కైరా రైనా (మహారాష్ట్ర) ద్వయంపై నెగ్గింది.









Comments