• May 02, 2026
  • NPN Log

    అనకాపల్లి : పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు(శుక్రవారం) పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామంలో హోం మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో హోం మంత్రి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం రామచంద్రపురం గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోటవురట్ల మండలం సుంకుపురు గ్రామంలో గంగమ్మ తల్లి పండగ సందర్భంగా అమ్మవారిని అనిత దర్శించుకున్నారు.

    ఆపై హోం మంత్రి మాట్లాడుతూ... అంకితభావం, కృషితో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదర సోదరీమణులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని అన్నారు. రెండోసారి పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పోలిట్‌బ్యూరో సభ్యురాలిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

    ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయని హోం మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రామచంద్రపురం గ్రామంలో కోటి 16 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. 2014 -19 సమయంలో పందూర్ బ్రిడ్జిని శంకుస్థాపన చేస్తే... మరలా ఎన్డీఏ ప్రభుత్వంలోనే బ్రిడ్జి పనులు పూర్తి చేశామని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో NREGS రూ.40 కోట్లు, ఆర్ అండ్ బి నుంచి 40 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేసినట్లు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పరిశ్రమల రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ రాకతో ఈ ప్రాంతం రూపు రేఖలు మారనున్నాయని, కోటవురట్ల మండలంలో కూడా పరిశ్రమలు తీసుకొస్తామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement