• Sep 20, 2026
  • NPN Log

    హీరో నానికి నేచురల్ స్టార్ అనే టైటిల్ ఎవరు ఇచ్చారో కానీ, ఆయనకు అది భలేగా సూటయింది. సహజంగా, మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ ఉంటారు నాని.. అందువల్లే ప్రేక్షకులను అనతికాలంలోనే ఆకట్టుకోగలిగారు. గత ఐదు సంవత్సరాల నుంచీ నాని సినిమాలు టాక్ ఎలా ఉన్నా.. జనాన్ని మాత్రం థియేటర్స్‌కు రప్పిస్తున్నాయి. అయితే నానికి మాత్రం ‘ఫ్యామిలీ హీరో’ ఇమేజ్ ఉందే తప్ప, మాస్ హీరోగా ఇంకా మార్కులు పడాల్సి ఉందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ‘ద ప్యారడైజ్’  సినిమా బంపర్ హిట్ అయి కనీసం 350 కోట్లకు పైగా వసూళ్ళు చూస్తేనే నానికి మాస్ హీరో ఇమేజ్ దక్కుతుందనీ చెబుతున్నారు. ఎందుకంటే ‘ద ప్యారడైజ్’ మూవీ బడ్జెట్ 200 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇప్పటి వరకు వంద కోట్ల బడ్జెట్‌తో నాని చిత్రాలేవీ తెరకెక్కలేదు.. అలాంటిది 200 కోట్లతో ‘ద ప్యారడైజ్’ అంటే ఆశ్చర్యం కలగకమానదు. పైగా నాని సినిమాలేవీ 200 కోట్ల గ్రాస్ చూసి ఎరుగవు. అందువల్ల ‘ద ప్యారడైజ్’ సినీ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి కలిగిస్తోంది.

    సినీ విశ్లేషణ

     

    ఇక నాని కెరీర్‌ను పరిశీలిస్తే ‘అలా మొదలైంది’తో తొలి హిట్ ఆయన ఖాతాలో చేరింది. ఆ తరువాత ‘పిల్ల జమీందార్, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎవడే సుబ్రమణ్యం, భలేభలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ, మిడిల్ క్లాస్ అబ్బాయ్, నేను లోకల్, జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న’ వంటి చిత్రాలు నానిని ‘నేచురల్ స్టార్’ ఇమేజ్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గర చేశాయి. ‘దసరా’, ‘హిట్ 3’ మినహాయిస్తే అన్ని చిత్రాల్లోనూ నాని ‘ఫ్యామిలీ హీరో’గానే సాగారు. ‘దసరా’లో మాస్ లుక్, ‘హిట్ 3’లో సీరియల్ లుక్‌తో ఆకట్టుకున్న నానిపై నమ్మకంతోనే ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ సినిమాకు అతని ఇమేజ్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి నిర్మించినట్టు తెలుస్తోంది. కాబట్టి ‘ద ప్యారడైజ్’ తప్పకుండా పెట్టుబడిని మించిన రాబడి చూడాలి.. అది జరిగితే నాని ‘మాస్’కు దగ్గరవుతాడనే చెప్పొచ్చు.

     

    ఇప్పటి వరకు నాని కెరీర్‌లో హిట్ అయిన సినిమాలన్నిటినీ పరిశీలిస్తే పెట్టుబడికి తగ్గ రాబడి కనిపిస్తుంది. అయితే ఆ వసూళ్ళేమీ సూపర్ డూపర్ హిట్స్ స్థాయివి కావు. నాని మూవీస్‌లో ‘దసరా’  ఒక్కటే 150 కోట్ల దాకా వసూళ్ళు చూసింది. ఈ కోణంలో చూస్తే ‘దసరా’ కాంబో నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజ్ ‘ద ప్యారడైజ్’కు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. డివైడ్ టాక్ వచ్చినా అప్పట్లో ‘దసరా’ సక్సెస్ రూటులో సాగింది. అదే తీరున ఇప్పుడు ‘ద ప్యారడైజ్’ కూడా ఆశించిన వసూళ్ళు రాబడితే నానికి తప్పకుండా మాస్ హీరో ఇమేజ్ దక్కుతుందనీ పరిశీలకులు భావిస్తున్నారు.. ఏమవుతుందో సెప్టెంబర్ 24న తేలిపోతుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement