• Sep 22, 2026
  • NPN Log

    హాలీవుడ్ ప్రముఖ నటి సిడ్నీ స్వీనీ ప్రచారం చేసిన ఓ బోల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీసింది. సిడ్నీ బెర్నిస్ స్వీనీ ఒక అమెరికన్ నటి. ఆమె ఎవ్రీథింగ్ సక్స్, ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్, షార్ప్ ఆబ్జెక్ట్స్, యుఫోరియా చిత్రాలలో తన పాత్రల ద్వారా ప్రారంభంలోనే గుర్తింపు పొందింది. తాజాగా సిడ్నీ ఒక స్పోర్ట్స్ ట్రేడింగ్ యాప్ కోసం రూపొందించిన ఒక ప్రచారంలోన్యూడ్‌గా కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ క్యాంపెయిన్‌లో ఆమె ఎలాంటి దుస్తులు లేకుండా, కేవలం ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హాకీ ప్యాడ్స్, టెన్నిస్ రాకెట్స్ వంటి క్రీడా పరికరాలను అడ్డుగా పెట్టుకుని కనిపించడం ప్రపంచవ్యాప్తంగా సినీ, క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

    అయితే ఈ ఫోటోషూట్ విజువల్స్ నెట్టింట వైరల్ అయిన కొద్ది సమయంలోనే తీవ్రమైన ప్రతికూల వ్యాఖ్యలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా క్రీడారంగానికి చెందిన మహిళలు, మాజీ మహిళా అథ్లెట్లు ఈ ప్రచార చిత్రాన్ని తీవ్రంగా ఖండించారు. క్రీడలను, మహిళా అథ్లెట్లను అనవసరంగా లైంగికంగా చిత్రీకరించడం ఏమాత్రం తగదని, స్పోర్ట్స్ ని కూడా సెక్సువలైజ్ చేస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. క్రీడల్లో మహిళలు తమ ప్రతిభ, శక్తి, సాధించిన విజయాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ఏళ్లుగా పోరాడుతుంటే, ఇలా శరీరాన్ని మాత్రమే చూపిస్తూ ప్రచారం చేయడం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఒక మాజీ అథ్లెట్ వ్యాఖ్యానించింది.

     

    సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలు క్రీడల్లో దశాబ్దాలుగా నిర్మించుకున్న గౌరవాన్ని ఒక్క ప్రకటనతో తుడిచిపెట్టేసినందుకు ధన్యవాదాలు.. సిగ్గులేదా ఆడవారి పరువు తీశావ్ అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. క్రీడలకు సంబంధించిన ప్రచారంలో మహిళలు తమ అందాలను ఆరబోయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇలాంటి విజువల్స్ చిన్నపిల్లలు, యువతపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించలేదా అని ప్రశ్నిస్తున్నారు.

    గతంలో కూడా పలు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్స్, ఫ్యాషన్ ఈవెంట్లలో తన బోల్డ్ లుక్స్‌తో వార్తల్లో నిలిచిన సిడ్నీ స్వీనీ.. ఈ ప్రకటనతో మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ప్రచారంలో సరిహద్దులు దాటి స్పోర్ట్స్ పరికరాలతో ఇటువంటి బోల్డ్ విజువల్స్ ఉపయోగించడం పబ్లిసిటీ స్టంటే అయినప్పటికీ, క్రీడారంగంలో మహిళల గౌరవానికి ఇది విఘాతం కలిగిస్తోందనే చర్చ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement