నేటి నుంచే బుక్ ఫెయిర్
తెలంగాణ : 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 29 వరకు కొనసాగనుంది. రోజూ 1PM నుంచి 9PM వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ రూ.10 కాగా రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులకు ప్రవేశం ఉచితం. జాతీయ, అంతర్జాతీయ పుస్తకాలతో మొత్తం 365 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. 11 రోజుల్లో 15 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి మీరు వెళ్తున్నారా?










Comments