పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు
ఆంధ్ర ప్రదేశ్ : ప్రస్తుత జీవనశైలి, పెరిగిన ఖర్చులతో దంపతులు ఒకరిద్దరు పిల్లలకే పరిమితమవుతున్నారు. అయితే చిత్తూరు(D) ఆవల్ కండ్రిగలో ఓ జంట 21 ఏళ్లలో 14 మంది పిల్లలకు జన్మనిచ్చారు. వీరిలో ఏడుగురు మగ, ఏడుగురు ఆడపిల్లలు కాగా ఓ బాలిక చనిపోయింది. 13 కాన్పులు ఇంట్లోనే జరగగా 14వ కాన్పు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో జరగడంతో ఈ విషయం బయటికొచ్చింది. ఇన్ని కాన్పులతో మహిళలకు తీవ్ర సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.









Comments