పవన్‌తో తోట చంద్రశేఖర్ భేటీ.. మళ్లీ జనసేనలోకి?
ఆంధ్ర ప్రదేశ్ : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తోట చంద్రశేఖర్ కలిశారు. మంగళగరిలోని జనసేన ఆఫీసులో భేటీ అయ్యారు. చంద్రశేఖర్ 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మూడేళ్ల కిందట బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా పని చేశారు. కానీ చాలా రోజులుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పవన్‌ను కలవడంతో ఆయన మళ్లీ జనసేనలోకి చేరుతారనే చర్చ జరుగుతోంది.









Comments