ఫీజుల భారం తగ్గించాలి: ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో హుండీ ఏర్పాటు చేయాలి - గిరిజన ఐక్య సాధన సమితి డిమాండ్.
ఉరవకొండ మన npn, news. డిసెంబర్, 16:అనంతపురం ఉమ్మడి జిల్లాలోని 63 మండలాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని, నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ కళాశాలల్లో హుండీలు ఏర్పాటు చేయాలని గిరిజన ఐక్య సాధన సమితి డిమాండ్ చేసింది.
డిమాండ్‌కు కారణాలు:
జీవనోపాధి లేమి: కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఉపాధి, జీవనోపాధి లేక నిరుపేద తల్లిదండ్రులు ఆర్థికంగా అల్లాడుతున్నారు.
ఫీజుల ఒత్తిడి: విద్యను వ్యాపారంగా మారుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యజమాన్యాల అధిక ఫీజుల ఒత్తిడిని తట్టుకోలేక, తల్లిదండ్రులు తమ ఆస్తులను అమ్ముకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భం ఇది.
హుండీ ప్రతిపాదన: దేవాలయాలలో భక్తులకు ఏ విధంగా హుండీ ఉందో, అదే విధంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు, పాఠశాలలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా హుండీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమితి అభిప్రాయపడింది. పేద విద్యార్థులు, బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకోవాలని కోరారు.
గిరిజన ఐక్య సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మూడు కేశవ నాయక్ ఈ మేరకు విద్యా సంస్థల యాజమాన్యాలను, ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీ నాయకులు బొజ్జప్ప, లక్ష్మన్న, బండి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










Comments