మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
తెలంగాణ : రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు 7-10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. OC విద్యార్థులు రూ.200, మిగతావారు రూ.125 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మార్చి/ఏప్రిల్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 19న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.










Comments