ఇఫ్తార్ మాదిరిగా హిందువులకు ప్రత్యేక కార్యక్రమాలేవి: రాజాసింగ్
హైదరాబాద్ : హిందు పండుగలు , ముస్లిం పండుగల మధ్య తేడా పైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముస్లింలకు ఇప్తార్ ఇచ్చినట్లుగానే హిందువుల కోసం ప్రత్యేక వేడుకలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసేలా చూడాలని కోరారు. రంజాన్ కోసం ఇఫ్తార్ మాదిరిగా హిందువుల కోసం నవరాత్రి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింల ఓట్ల కోసం ఇఫ్తార్ వేడుకలను చేసే నేతలకు హిందువుల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. ఓట్ల గురించి టోపీ పెట్టుకొనే రాజకీయ పార్టీలకు హిందువులు బుద్ది చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు.









Comments