• May 02, 2026
  • NPN Log

    అమరావతి : బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్‌ (బెం.తా.హై.)! ఇవి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘క్యాంపులు’! ప్రస్తుతం తా డేపల్లి, బెంగళూరు మధ్య తిరుగుతున్న ఆయన... తన మూడో క్యాంపును సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఆయన వారంలో 5రోజులు బెంగళూరు యలహంక ప్యాలె్‌సలోనే మకాం వేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్‌ చేరుకుంటున్నారు. మంగళ, బుధవారాల్లో అక్కడే ఉంటున్నారు. ఇకపై.. వీకెండ్‌లో హైదరాబాద్‌లోని లోట్‌సపాండ్‌ ప్యాలె్‌సలో కూడా మకాం వేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. నిజానికి.. 2019లో అధికారంలోకి రాకముందు జగన్‌ దాదాపు పూర్తిసమయం లోటస్‌ పాండ్‌ ప్యాలె్‌సలోనే ఉండేవారు. రాజకీయ కార్యకలాపాల కోసం మాత్రమే అమరావతికి వచ్చి వెళ్లేవా రు. 2019లో అధికారంలోకి వచ్చాక.. వీలుకుదిరినప్పుడల్లా హైదరాబాద్‌ ప్యాలె్‌స కే వెళ్లేవారు. అక్కడే రాజకీయ సమీక్షలు చేసేవారు. రాజకీయ మిత్రులుగా ఉన్న బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపేవారు. నాటి సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసేవారు. 2023లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడం, మరుసటి ఏడాది తానూ ‘మాజీ’ కావడంతో హైదరాబాద్‌ వైపు చూడడం మానేశారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌లో క్యాంప్‌ వేయాలని జగన్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పాదయాత్ర చేస్తానని జగన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు రచించేందుకు.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో తరచూ ‘టచ్‌’లో ఉండేందుకే వీకెండ్‌లో హైదరాబాద్‌లో గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement