మద్దతు ధరతో కందులు, మినుములు, పెసర కొనుగోలు
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలో పప్పు ధాన్యాలు పండించే రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్దతు ధరపై(ఖరీఫ్ 2025-26) 1,16,690 మె.టన్నుల కందులు, 28,440 మె.టన్నుల మినుములు, 903 మె.టన్నుల పెసర కొనుగోలుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ లేఖ రాశారు. దీంతో క్వింటా కందులకు దాదాపు రూ.8000, మినుములకు రూ.8,110, పెసరకు రూ.8,768 అందనుంది.









Comments