• Sep 20, 2026
  • NPN Log

    బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పడుకోణె, రణ్‌వీర్ సింగ్ ఇంట మళ్లీ పండగ వాతావరణం మొదలైంది. ఈ టాలెంటెడ్ అండ్ మోస్ట్ లవ్డ్ కపుల్ రెండవసారి తల్లిదండ్రులయ్యారు. శనివారం (19 సెప్టెంబర్ 2026) దీపికా పడుకోణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. పాప చిన్నారి అడుగుల గుర్తుతో రూపొందించిన క్యూట్ కార్డ్‌ను షేర్ చేస్తూ వెల్కమ్ బేబీ గర్ల్ అని రాసుకొచ్చారు.

    గతంలో ఈ జంటకు మొదటి సంతానంగా దువా జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా రెండేళ్ల తర్వాత, అదే సెప్టెంబర్ నెలలో మరోసారి లక్ష్మీదేవి లాంటి ఆడపిల్ల వారి జీవితంలోకి అడుగుపెట్టడంతో దీపికా-రణ్‌వీర్ దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుల జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

    రణ్‌వీర్ సింగ్ తన సినిమాలతో, దీపికా తన వరుస గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఇప్పుడు రెండో పాపాయి రాకతో వారి ఇంట్లో సందడి మరింత రెట్టింపు అయింది. దువాకు ఇప్పుడు ఒక ముద్దుల చెల్లెలు తోడైందంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక దీపికా సినిమాల విషయనికొస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన రాకా సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యనే ఆమె ప్రెగ్నెంట్ గా కొన్ని సీన్స్ షూట్ చేసినట్లు సమాచారం. ఇక కొన్నిరోజులు దీపికా రెస్ట్ మోడ్ లో ఉంటుందని, ఆ తరువాత రాకా షూట్ లో పాల్గొంటుందని తెలుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement