మళ్లీ 24,000 పైకి నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లలో కొనుగోళ్లు పెంచడంతో ఈక్విటీ సూచీలు భారీగా లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 918.60 పా యింట్ల లాభంతో 77,550.25 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 275.50 పాయింట్ల వృద్ధితో 24,050.60 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.6.44 లక్షల కోట్ల వృద్ధితో రూ.451.23 లక్షల కోట్లకు (4.87 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.










Comments