• Sep 22, 2026
  • NPN Log

    ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య మెయిన్ లీడ్స్ లో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి 3 పాటలు, టీజర్ రిలీజ్ అయి ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మిస్సింగ్ మేఘన సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది.

     

    ఈ సందర్భంగా నిర్మాత నరేష్ మాట్లాడుతా.. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం. కంటెంట్ బాగా వచ్చింది. బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాము. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ వి.వి. వినాయక్, ఫస్ట్ సాంగ్ సురేష్ బాబు, సెకండ్ సాంగ్ దిల్ రాజు, మూడవ సాంగ్ కోన వెంకట్ రిలీజ్ చేసారు. థ్రిల్లర్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ మిస్సింగ్ మేఘన మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. కోట్లు ఖర్చుపెట్టి మా 2 ఏళ్ల ఫ్యూచర్ పెట్టి ఇలా వచ్చి అలా వెళ్ళే సినిమా అయితే మేము చేయలేదు. క్లైమాక్స్ లో వచ్చే హుక్ పాయింట్ కి అందరూ షాక్ అవుతారు. ఇది ఎమోషనల్ థ్రిల్లర్. ఈ సినిమా మీద మాకు నమ్మకం ఉంది. ఒక పెద్ద నిర్మాణ సంస్థ మా సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది అని తెలిపారు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement