• May 02, 2026
  • NPN Log

    ముంబై: వచ్చేనెలలో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం అమితా శర్మ సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీ సమావేశం కానుంది. టీ20 వరల్డ్‌కప్‌ వచ్చేనెల 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్‌, వేల్స్‌ వేదికలుగా జరగనుంది. గత నవంబరులో వన్డే ప్రపంచక్‌పలో విజేతగా నిలిచిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు.. అనంతరం పొట్టి ఫార్మాట్‌లో నిలకడలేమి ఆటతీరుతో నిరాశపరుస్తోంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి ఎవరిని ఎంపిక చేస్తారు? ఎవరికి ఉద్వాసన పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే, త్వరలో స్వదేశంలో భారత్‌ వేదికగా ఇంగ్లండ్‌ మహిళలతో జరిగే మూడు టీ20ల సిరీస్‌, ఏకైక టెస్టుతో పాటు ఇంగ్లండ్‌-ఎతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీ్‌సల కోసం కూడా జట్టును శనివారమే ప్రకటించనున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement