• Sep 20, 2026
  • NPN Log

    ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం చాలామందిలో కనిపిస్తోంది. శరీరంలో ప్యూరిన్లు విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎక్కువగా పేరుకుపోతే కీళ్లలో స్ఫటికాలుగా ఏర్పడి వాపు, నొప్పి వంటి సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా గౌట్‌ ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే పుట్టగొడుగులు తింటే యూరిక్ యాసిడ్ పెరుగుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది.

    పుట్టగొడుగులు తినవచ్చా?

    పుట్టగొడుగుల్లో ప్యూరిన్లు కొంతమేర ఉంటాయి. అయితే వాటిని తింటే తప్పనిసరిగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందని చెప్పలేం. పుట్టగొడుగుల్లో ఉండే ప్యూరిన్ల పరిమాణం రకాన్ని బట్టి మారవచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు లేదా గౌట్‌ సమస్య ఉన్నవారు పుట్టగొడుగులను అధికంగా తీసుకోకుండా, వైద్యుల సూచనలను పాటించడం మంచిది.

    యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే ఏం తినాలి?

    యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఆహారంతో పాటు తగినంత నీరు తాగడం, బరువును నియంత్రించుకోవడం కూడా ముఖ్యమే. ఓట్స్, ఓట్‌మీల్, తక్కువ కొవ్వు ఉన్న పాల పదార్థాలు, పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు వంటి ఆహారాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా నీటిని తగినంతగా తాగడం వల్ల శరీరం యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపేందుకు సహాయపడుతుంది. మద్యం, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, ఎర్ర మాంసం, అధిక ప్యూరిన్‌ ఉన్న ఆహారాలను పరిమితం చేయడం మంచిది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement