• Sep 20, 2026
  • NPN Log

    క్తపోటును నియంత్రించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం. అయితే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేసే కొన్ని సులభమైన వ్యాయామాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి వాటిలో ప్లాంక్ ఒకటి. ప్లాంక్ కేవలం కండరాలను బలోపేతం చేయడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలు అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    ప్లాంక్ అంటే ఏంటి?

    ప్లాంక్ అనేది ఒక రకమైన ఐసోమెట్రిక్ వ్యాయామం. ఇందులో శరీరాన్ని ఒకే భంగిమలో ఉంచి కండరాలను బిగించి ఉంచాలి. కదలిక లేకపోయినా కండరాలపై నిరంతర ఒత్తిడి ఉంటుంది. ప్లాంక్‌తో పాటు వాల్ సిట్, హ్యాండ్ గ్రిప్ హోల్డ్ వంటి వ్యాయామాలు కూడా ఐసోమెట్రిక్ వ్యాయామాల కిందకు వస్తాయి. ఇలాంటి వ్యాయామాలు కండరాల బలాన్ని పెంచడంతో పాటు.. రక్తనాళాలు ఒత్తిడికి స్పందించే విధానాన్ని ప్రభావితం చేయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.

    60 సెకన్ల ప్లాంక్‌తో బీపీ తగ్గుతుందా?

    ప్లాంక్ వంటి ఐసోమెట్రిక్ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు రెండింటినీ తగ్గించడంలో సహాయపడవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. 270 క్లినికల్ ట్రయల్స్‌ నుంచి సేకరించిన డేటాను పరిశీలించిన ఒక విశ్లేషణలో.. ఐసోమెట్రిక్ వ్యాయామాలు రక్తపోటును తగ్గించడంలో ఇతర కొన్ని వ్యాయామాల కంటే మెరుగైన ఫలితాలు చూపినట్లు వెల్లడైంది.

    60 సెకన్ల పాటు ప్లాంక్‌లో ఉండేటప్పుడు పొట్ట, భుజాలు, వీపు వంటి అనేక కండరాలు ఒకేసారి పనిచేస్తాయి. ఈ సమయంలో శరీరంలో రక్తపోటులో తాత్కాలిక మార్పులు చోటుచేసుకోవచ్చు. వ్యాయామం పూర్తయిన తర్వాత రక్తనాళాల పనితీరులో వచ్చే మార్పులు.. క్రమంగా విశ్రాంతి సమయంలో ఉండే రక్తపోటును తగ్గించడంలో సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    రోజూ ప్లాంక్ ఎలా చేయాలి?

    మొదట 20–30 సెకన్ల పాటు ప్లాంక్ చేయాలి.

    అలవాటు అయిన తర్వాత క్రమంగా 60 సెకన్ల వరకు సమయాన్ని పెంచుకోవచ్చు.

    ప్లాంక్ చేసేటప్పుడు వెన్నెముకను సాధ్యమైనంత వరకు నిటారుగా ఉంచాలి.

    ముఖ్యంగా శ్వాసను బిగబట్టకుండా సహజంగా తీసుకోవాలి.

    ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారు ఇతర గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్లాంక్ చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement