రైతుల ఖాతాల్లో మళ్లీ పీఎం కిసాన్ నగదు.. ముహూర్తం ఫిక్స్
న్యూఢిల్లీ : రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా నిధులు అందిస్తుంది. 23వ పీఎం కిసాన్ యోజన నిధులు విడుదలకు కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దాంతో ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున నగదు జమ కానుంది. ప్రతి ఏటా మూడు దఫాలుగా ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పథకం ద్వారా ఏడాదికి మొత్తం రూ. 6 వేలు రైతుల ఖాతాలో నగదు జమ అవుతాయి. అవి మూడు దఫాలుగా.. నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో ఈ నగదు కేంద్రం వేస్తోంది. 2019లో పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 13వ తేదీన 22వ విడత నగదును రైతులకు అసోంలోని గౌహతి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం విదితమే.








Comments