రూ. 500 నకిలీ నోట్ల కలకలం.. రైతును అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వర్నిలో భారీగా నకిలీ రూ. 500 నోట్లు కలకలం సృష్టించింది. దాదాపు రూ. 2 లక్షలకు పైగా విలువ చేసే నకిలీ నోట్లు లభ్యం కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. వర్ని మండలం జలాల్‌పూర్‌కు చెందిన రైతు నేరెడ్ల చిన్న సాయిలు.. గతంలో స్థానిక కెనరా బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాడు. గురువారం ఆ నగదును కెనరా బ్యాంకులో చిన్న సాయిలు చెల్లించాడు.
ఈ సందర్భంగా ఆ నగదును బ్యాంకు అధికారులు లెక్కిస్తుండగా.. అవి నకిలీ నోట్లు అని కనుగొన్నారు. ఈ నకిలీ నోట్లపై పోలీసులకు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. రైతు నేరెడ్ల చిన్న సాయిలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంత భారీ మొత్తంలో నకిలీ నోట్లు ఎలా వచ్చాయనే కోణంలో ఆ రైతును పోలీసులు ప్రశ్నిస్తున్నారు.










Comments