• May 01, 2026
  • NPN Log

    ముంబై: ఫోన్‌పే, పేటీ ఎం, గూగుల్‌ పే వంటి డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ల ద్వారా రూ.10,000 పైగా సొమ్మును ఇకపై తక్షణమే బదిలీ చేసే వీలుండదు. మీ నుంచి సొమ్ము అందుకునే వా రు కనీసం గంట వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు, ముఖ్యంగా సీనియర్‌ సిటిజిన్లను వీటి నుంచి కాపాడేందుకు ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), ఇమ్మీడియేట్‌ పేమెంట్‌ సర్వీసె్‌స (ఐఎంపీఎస్‌) ద్వారా రూ.10,000 పైబడిన చెల్లింపు లావాదేవీలను ఇక గంట తర్వాతే ప్రాసెస్‌ చేయాలని ప్రతిపాదించింది. దీని వల్ల లావాదేవీపై ఏదైనా అనుమానం వస్తే గంట లోగా దాన్ని రద్దు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఒక వ్యక్తి మరో వ్యక్తికి (పీ2పీ) జరిపే చెల్లింపులకు మాత్రమే ఇది వర్తించనుంది. ధ్రువీకృత వర్తకులకు జరిపే చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదు. అంతేకాదు, వ్యక్తుల విభాగంలోనూ వినియోగదారులు తన నమ్మకమైన వారి వివరాలను నమోదు చేసేందుకు వీలుగా వైట్‌లిస్టింగ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ సూచించింది. తద్వారా నమ్మకమైన వ్యక్తుల అకౌంట్లకు రూ.10,000 పైగా సొమ్మును కూడా తక్షణమే బదిలీ చేయగలుగుతారు. తాజా ప్రతిపాదనలపై మే 8 కల్లా అభిప్రాయాలను తెలుపాలని ఆర్‌బీఐ ప్రజలను కోరింది. గడిచిన కొన్నేళ్లలో డిజిటల్‌ చెల్లింపుల మోసాలు భారీగా పెరిగాయి. నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ప్రకారం.. గడిచిన నాలుగేళ్లలో ఈ కేసులు 10 రెట్లు పెరిగాయి.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement