వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్‌లో కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. మంగళవారం ఇంటర్‌బోర్డు కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ విషయం వెల్లడయింది. మానవీయ శాస్త్రాలు(హ్యుమానిటీస్), భాష విభాగానికి చెందిన నిపుణులు పాల్గొన్న ఈ సమావేశంలో సిలబస్ రూపకల్పనపై చర్చ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మాట్లాడుతూ మానవ, నైతిక విలువలు పెంచేలా కొత్త సిలబస్ ఉండాలని సూచించారు. కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న మార్పులను పొందుపరచాలని కోరారు.










Comments