• Sep 20, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. చాటింగ్‌లకే పరిమితం కాకుండా భారత వినియోగదారులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. రోజూవారీ అవసరాలైన విద్యుత్‌, గ్యాస్‌, ఫాస్టాగ్‌, ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌ కార్డు బిల్లులతో పాటు ఈఎంఐలు చెల్లించేందుకు ‘బిల్‌ పేమెంట్‌’ ఫీచర్‌ను ప్రారంభించింది. భారత్‌ కనెక్ట్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా పనిచేసే ఈ ఫీచర్‌తో.. దేశవ్యాప్తంగా 30 విభాగాల్లో ఉన్న 22వేలకు పైగా బిల్లింగ్‌ కంపెనీలకు నేరుగా చెల్లింపులు చేయవచ్చు. డిజిటల్‌ పేమెంట్‌ మార్కెట్‌లో 80శాతానికి పైగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఫోన్‌పే, గూగుల్‌పే యాప్‌లకు వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త సేవలతో గట్టి పోటీ ఎదురుకానుంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement