వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు నో పర్మిషన్: రఘురామ
పశ్చిమగోదావరి జిల్లా : వినాయకుని నిమజ్జనాల్లో డీజే పర్మిషన్ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కొంతమంది యువకులు ఈరోజు (ఆదివారం) కలిశారు. అయితే, ఉండి నియోజకవర్గంలో వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు నో పర్మిషన్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. డీజే సౌండ్స్‌కు ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. సౌండ్ పొల్యూషన్ లేకుండా వినాయక నిమజ్జనాలు చేసుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.









Comments