• May 02, 2026
  • NPN Log

    ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చాడు. తాను బయటి నుంచే వచ్చే విమర్శలపై దృష్టి పెట్టడం లేదని, జట్టు విజయం కోసమే తాను ఆలోచిస్తానని తెలిపాడు.

    మ్యాచ్ ముగిసిన అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. తమ జట్టు చేసిన స్కోరు విజయానికి సరిపోతుందనే భావించానని పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై 200 పరుగులు అంటే మంచి స్కోరే అని, ఇన్నింగ్స్ గడిచేకొద్దీ పిచ్ నెమ్మదిస్తుందని అంచనా వేసినట్లు తెలిపాడు. అయితే, మిడిల్ ఓవర్లలో తమ బౌలర్లు మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉందని.. ప్రత్యర్థి బ్యాటర్లు అడ్డుకోవడంలో విఫలమయ్యామని పరాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒకే ఓవర్లో వరుసగా బౌండరీలు సమర్పించుకోవడం, ఆ తప్పు పదేపదే పునరావృతం కావడం తమ ఓటమి కారణమని రియాన్ పేర్కొన్నాడు.

    బౌలర్ల పదేపదే తప్పులు చేయడంతో ఢిల్లీ బ్యాటర్లకు ఫామ్ దొరికిందని, తాము ప్లాన్ మార్చుకోవడంలో విఫలమయ్యామని వెల్లడించాడు. అయితే మ్యాచ్ ఫలితం తేడాగా వచ్చినప్పటికీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంలో సరైన నిర్ణయమేనని పరాగ్ సమర్థించుకున్నాడు. తన బ్యాటింగ్ ఫామ్‌పై వస్తున్న విమర్శల గురించి కూడా పరాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విమర్శకులకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశాడు. జట్టుకు రెండు పాయింట్లు అందించడమే తన అసలు లక్ష్యమని.. జట్టు ఓడిపోయినప్పుడు తాను ఎంత స్కోర్ చేసిన వృథానేనని పరాగ్ భావోద్వేగంగా సమాధానమిచ్చాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement