• Sep 20, 2026
  • NPN Log

    ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతోన్న మోస్ట్ ప్రెస్టీజియస్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ . భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ సినిమా సరిహద్దులు దాటించేలా జక్కన్న ఈ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అంతర్జాతీయ సినీ సర్కిల్స్ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌ను అందించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నార్వే ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ‘గింప్‌విల్లే’ ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ వీఎఫ్ఎక్స్ బాధ్యతలను చేపట్టినట్లు సమాచారం.

    ఈ సినిమా కేవలం భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే గ్లోబల్ స్పెక్టాకిల్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోసం అత్యంత అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం 400 FPS (ఫ్రేమ్స్ పర్ సెకండ్) హై-ఎండ్ స్లో-మోషన్ కెమెరాలను వాడుతున్నారు. భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్ పరిసరాలు, అంతర్జాతీయ స్థాయి మోషన్-క్యాప్చర్ టెక్నాలజీతో పాటు విదేశీ టాప్-క్లాస్ వీఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారంతో దృశ్యాలను చెక్కుతున్నారు. షూటింగ్ జరుపుతూనే సమాంతరంగా పోస్ట్-ప్రొడక్షన్ వీఎఫ్ఎక్స్ పనులను కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తుండటం ఈ చిత్ర నిర్మాణ శైలిలోని మరో ప్రత్యేకత.

    ఈ అంతర్జాతీయ అడ్వెంచర్ డ్రామాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. అనౌన్స్‌మెంట్ వీడియోతోనే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరిపోగా.. పూర్తి సినిమాలో జక్కన్న సృష్టించిన ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. కేవలం సినిమాను లార్జర్ దేన్ లైఫ్‌గా చూపించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ప్రేక్షకుడు ఒక సరికొత్త లోకంలోకి వెళ్లిపోయినట్లు నమ్మేలా ఈ విజువల్ అద్భుతాన్ని రాజమౌళి డిజైన్ చేస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పలకనున్న ‘వారణాసి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి!

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement