వరుణ్ కెరీర్ బెస్ట్ రేటింగ్
దుబాయ్: టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో వరుణ్.. 818 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 34 ఏళ్ల వరుణ్ కెరీర్‌లో ఇదే బెస్ట్ రేటింగ్ పాయింట్లు కావడం విశేషం.









Comments