• Sep 20, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది జూలై లో ప్రకటించిన ‘సెమీకాన్‌ 2.0’ పథకం ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారం ఢిల్లీలో ప్రారంభమైన సెమీకాన్‌ ఇండియా, 2026 సదస్సులోనే దీనికి సంబంధించి 1,100 కోట్ల డాలర్ల నుంచి 1,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.05 లక్షల కోట్ల నుంచి రూ.1.15 లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. సెమీకండక్టర్‌ చిప్స్‌, యంత్ర పరికరాల తయారీ, లోహాలు, గ్యాసెస్‌, రసాయనాలు, అసెంబ్లీ, టెస్టింగ్‌, మార్కింగ్‌, ప్యాకేజింగ్‌ యూనిట్ల రూపం లో ఈ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. వాటాదారులు, డైరెక్టర్ల బోర్డు ల ఆమోదం లభించిన వెంటనే కంపెనీలు ఈ విషయం ప్రకటిస్తాయన్నారు. సెమీకాన్‌ ద్వారా లక్ష మందికి ఉద్యోగావకాశాలు కూడా ఏర్పడే అవకాశం ఉందన్నారు.

    ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌

    ప్రపంచ సెమీకండక్టర్ల రంగానికి భారత్‌ విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. భారత్‌లో తయారైన చిప్స్‌ ప్రస్తుతం దేశ, విదేశాల్లోని కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement