• Sep 20, 2026
  • NPN Log

    సీనియర్‌ నటి సిమ్రన్‌  రెండో ఇన్నింగ్స్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు కథానాయికగా దక్షిణాది ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె.. వివాహం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కీలక పాత్రల్లో కనిపిస్తూ తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇప్పుడు వరుస అవకాశాలతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకుంటూ మరోసారి తన సత్తా చాటుతున్నారు. గతేడాది విడుదలైన ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ చిత్రంలో సిమ్రన్‌ కీలక పాత్రలో నటించారు. కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో పాటు.. భావోద్వేగాలను సహజంగా పలికించడంలో సిమ్రన్‌ చూపించిన ప్రతిభకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, సాధారణ కుటుంబాల్లో చోటుచేసుకునే పరిస్థితులను ప్రతిబింబించేలా ఆమె నటన సాగింది. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి సహజమైన నటనతో మెప్పించారు.‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో పాటు వసూళ్ల పరంగానూ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సిమ్రన్‌ నటనకు వచ్చిన గుర్తింపుకు కొనసాగింపుగా తాజాగా ప్రతిష్ఠాత్మక సైమా అవార్డు కూడా ఆమెను వరించింది. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’ చిత్రానికి ఉత్తమ నటిగా సిమ్రన్‌ అవార్డును అందుకున్నారు. దీంతో ఆమె సెకండ్  ఇన్నింగ్స్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు.

    సిమ్రన్‌ మాట్లాడుతూ.. ‘‘నా మీద నమ్మకంతో మంచి పాత్రలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’కి ప్రేక్షకులు అందించిన ఆదరణ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ చిత్రానికి ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకోవడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా మంచి కథలు, బలమైన పాత్రలను ఎంచుకుంటూ నా నటనతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తాను. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, నన్ను ఉత్తమ నటిగా ఎంపిక చేసిన సైమా అవార్డు కమిటీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement