• Sep 20, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : సైబర్‌ నేరగాళ్ల వలలో పడి ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును పోగొటుకోకుండా కేంద్ర టెలికాం శాఖ(డీవోటీ) తీసుకొచ్చిన ‘ఫైనాన్షియల్‌ ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌’(ఎ్‌ఫఆర్‌ఐ) కీలకంగా వ్యవహరిస్తోంది. టెలికాం శాఖ గతేడాది మే 22న ఎఫ్‌ఆర్‌ఐ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాగా.. ఈ వ్యవస్థ 15 నెలల వ్యవధిలో ఏకంగా రూ. 5,043.73 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలను అడ్డుకుంది. 2026 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య కేవలం నాలుగు నెలల్లోనే రూ.2 వేల కోట్లకు పైగా సొమ్ము సైబర్‌ నేరగాళ్లకు బదిలీ కాకుండా ఆపింది. టెలికాం శాఖ పరిధిలోని ‘డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌’ ద్వారా ఈ ఎఫ్‌ఆర్‌ఐ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఎవరైనా ఓ వ్యక్తి అనుమానాస్పద మొబైల్‌ నంబర్‌కు డబ్బు పంపే ప్రయత్నం చేయగానే.. ఎఫ్‌ఆర్‌ఐ వ్యవస్థ వెంటనే ఆ యూజర్‌ను అప్రమత్తం చేస్తోంది. సదరు లావాదేవీపై హెచ్చరిక చేయడం లేదా లావాదేవీని స్తంభింపజేయడం చేస్తుంది. ఈ హెచ్చరిక వల్ల వినియోగదారు లావాదేవీపై తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement