3 కంపెనీల సిస్టమ్స్‌లోకి చొరబడ్డ జెమినై
వాషింగ్టన్ : కంపెనీల కంప్యూటర్లలో ఉండే బలహీనతలను కనిపెట్టే శిక్షణలో భాగంగా ‘ఇర్రెగ్యులర్’ అనే సైబర్‌సెక్యూరిటీ మూల్యాంకన సంస్థ.. ఈ ఏడాది మే నెలలో గూగుల్ జెమినైకి ఒక పరీక్ష పెడితే, అది నిజంగానే 3 కంపెనీల కంప్యూటర్లను హ్యాక్ చేసింది. వాటిలో ఒక కంపెనీ పాస్‌వర్డ్‌ను జెమినై తానే సొంతంగా అంచనా వేసి లాగిన్ అయ్యింది. మరో రెండు కంపెనీలకు చెందిన సిస్టమ్ పాస్‌వర్డ్స్ అప్పటికే నెట్‌లో లీక్ అవడంతో వాటిని ఉపయోగించి ఆ కంప్యూటర్లలోకి లాగిన్ అయ్యింది. అయితే.. జెమినైకి ఈ పరీక్ష పెట్టిన పరిశోధకులు అది నిజమైన సంస్థల సర్వర్లలోకి చొరబడ్డ విషయాన్ని గుర్తించి టెస్టింగ్‌ను నిలిపివేశారు. ఈ విషయాన్ని గూగుల్ సంస్థకు తెలిపారు. వెంటనే గూగుల్ ప్రతినిధులు ఆయా కంపెనీలను సంప్రదించి వాటి డేటాకు ఎలాంటి హానీ జరగలేదని ధ్రువీకరించుకున్నారు. తమ టెస్టింగ్ ప్రొటోకాల్స్‌ను, భద్రతాపరిమితులను మరింత కఠినతరం చేశారు.









Comments