55 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నరేశ్!
వెర్సటైల్ యాక్టర్ నవరసరాయ డా. నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా గోవా లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు, డా. నరేష్‌ను సత్కరించారు. భారతీయ సినీ పరిశ్రమలో 55 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ డా. నరేష్‌ను అభినందించి లోక్ భవన్లో సత్కరించారు. గోవాలోని తెలుగు కమ్యూనిటీ సభ్యులు డా. నరేష్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను లోక్‌భవన్‌కు ఆహ్వానించగా, అక్కడ చారిత్రాత్మక భవనాన్ని సందర్శించారు. గౌరవనీయ గవర్నర్ ఆయనకు టీ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నరేష్ తన ప్రొఫెషనల్ ప్రొఫైల్‌ను గవర్నర్‌కు వివరించారు. సినీ రంగంలో తన సుదీర్ఘ ప్రయాణంతో పాటు సామాజిక, దౌత్యపరమైన కార్యక్రమాల్లో తన అనుబంధాన్ని వివరించారు. ప్రస్తుతం నరేశ్ UNIGOకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ & డిఫెన్స్ ప్లానింగ్‌లో అంబాసిడర్, హానరరీ కల్నల్ ఇండియన్ కమాండ్ హోదాల్లో సేవలందిస్తున్నారు.










Comments