• Sep 20, 2026
  • NPN Log

    EPFO (Employees' Provident Fund Organisation) తన సభ్యుల కోసం అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను అందుబాటులోకి తెచ్చింది. UAN రిజిస్టర్డ్ నంబర్ ఉన్నవారు ఇక మీదట వాట్సాప్‌లో PF బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్లు, క్లెయిమ్ స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు, PF పథకాల సమాచారం, కీలక ప్రకటనలు, నోటిఫికేషన్‌లను నేరుగా తెలుసుకోవచ్చు. UAN రిజిస్టర్డ్ నంబర్ ఉన్నవారు PF బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్లు, క్లెయిమ్ స్టేటస్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. అయితే, ఈ ఛానెల్ కేవలం వార్తలు/అప్‌డేట్లకే పరిమితం కాబట్టి, డబ్బులు ఉపసంహరించుకోవడం (Withdrawal) లేదా పూర్తి ఖాతా సమాచారం కోసం మాత్రం అధికారిక EPFO పోర్టల్ లేదా UMANG యాప్‌ను మాత్రమే ఉపయోగించాలి.

    వాట్సాప్ ఛానెల్‌లో ఎలా జాయిన్ అవ్వాలి?

    డైరెక్ట్ లింక్ ద్వారా: మీ ఫోన్‌లో https://www.whatsapp.com/channel/0029Vb6kmH48Pgs8ftd6Kw3Y లింక్‌పై క్లిక్ చేసి 'Follow' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

    QR కోడ్ ద్వారా: EPFO తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన QR కోడ్‌ను స్కాన్ చేసి జాయిన్ అవ్వవచ్చు.

    సెర్చ్ చేయడం ద్వారా: వాట్సాప్‌లో 'Updates' టాబ్‌కి వెళ్ళి, Channels > Explore విభాగంలో "EPFO" అని సెర్చ్ చేసి బ్లూ టిక్/వెరిఫైడ్ ఛానెల్‌ను ఫాలో అవ్వవచ్చు.

    2. ఈ ఛానెల్ ద్వారా సభ్యులకు ఏం లభిస్తుంది?

    EPFOకి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు, పథకాల వివరాలు, విధివిధానాల అప్‌డేట్లు నేరుగా అందుతాయి. దీనితో పాటు EPFO అందిస్తున్న ఇతర వాట్సాప్ సేవల ద్వారా చందాదారులు తమ UAN కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉపయోగించి PF బ్యాలెన్స్, చివరి 5 ట్రాన్సాక్షన్లు మరియు క్లెయిమ్ స్టేటస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.

    3. ఈ ఛానెల్ ద్వారా ఏమి చేయలేరు?

    ఈ ఛానెల్ కేవలం సమాచార మార్పిడికి (Updates) మాత్రమే పరిమితం. రెగ్యులర్ లాగిన్, ఖాతా వివరాలు పూర్తిగా చూడటం లేదా డబ్బులు విత్‌డ్రా (విత్‌డ్రావల్ క్లెయిమ్స్) చేసుకోవడం వంటి పనులను ఛానెల్ ద్వారా నేరుగా చేయలేరు. వాటి కోసం ఉమాంగ్ (UMANG) యాప్ లేదా అధికారిక EPFO పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించాలి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement