• Sep 22, 2026
  • NPN Log

    అనుకోకుండా జ‌రిగే ఓ ఘ‌ట‌న కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌తో పాటు మ‌న చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనూ అనుకోని ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టానికి కార‌ణ‌మ‌వుతాయి. అలాంటి ఓ వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు.

    టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళ్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేఘాల‌యా రాష్ట్రంలో పూర్తిగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదే కావ‌టం విశేషం. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే సినిమాలో పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ అవెలా ప్ర‌వ‌ర్తిస్తాయ‌నే విష‌యాన్ని రివీల్ చేశారు. సినిమా క‌థ‌నంలో ఓ వేగం క‌నిపిస్తూనే ఎంట‌ర్‌టైనింగ్‌గానూ సినిమా ఉంటుంద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతుంది.

    ఈ నేప‌థ్యంలో .. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్బంగా అక్టోబ‌ర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ రిలీజ్ చేయ‌టం విశేషం. సాంగ్ యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంద‌ని, డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని దేవిశ్రీప్ర‌సాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు.

    చిత్ర నిర్మాత‌ వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చుట్టూ కాన్సెప్ట్‌తో రూపొందిన బా బా బ్లాక్ షీప్ మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 9న సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. మేఘాల‌యా రాష్ట్రంలో చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిగా కంప్లీట్ చేసిన తొలి ద‌క్షిణాది సినిమా ఇది. ముఖ్యంగా చిరపుంజి వంటి అద్భుత‌మైన లొకేష‌న్స్‌లోనూ చిత్రీక‌రించాం. ప‌క్కా ప్లానింగ్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. మా డైరెక్ట‌ర్ గుణి, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హా ఎంటైర్ టీమ్‌ స‌హకారంతో ఇది సాధ్య‌మైంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని అప్‌డేట్స్‌ను అందిస్తాం’’ అన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement