అక్షర్ అవుట్
న్యూఢిల్లీ: అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీ్‌సకు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమయ్యాడు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ సోమవారం తెలిపింది. ఐదు టీ20ల సిరీ్‌సలో భాగంగా ఆదివారం ధర్మశాలతో జరిగిన మూడో మ్యాచ్‌కు అక్షర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో కుల్దీ్‌పను తుది జట్టులోకి తీసుకొన్నారు. ‘ప్రస్తుతం అక్షర్ జట్టుతోనే ఉన్నాడు. వైద్యులు అతడిని పర్యవేక్షిస్తున్నారు. లఖ్‌నవూ, అహ్మదాబాద్‌లో జరిగే టీ20లకు అక్షర్ స్థానాన్ని షాబాజ్‌తో భర్తీ చేశామ’ని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా చెప్పాడు. 31ఏళ్ల షాబాజ్ 2 టీ20లు, 3 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.










Comments